Breaking News

Maharashtra Gurukul: ‘అభ్యంతరకరంగా తాకాడు’: బాధిత విద్యార్థిని

Published on Wed, 10/15/2025 - 10:50

రత్నగిరి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే తప్పుదారి పట్టిన ఉదంతాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరిలో గల వార్కారి గురుకుల్ హెడ్‌ భగవాన్ కోకరే మహారాజ్ ఒక మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు అతనితో పాటు అతనికి సహకరించిన ఒక ఉపాధ్యాయుడిని అరెస్ట్‌ చేశారు.

గురుకుల క్యాంపస్‌లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో గురుకుల్ హెడ్‌ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ అనే ఉపాధ్యాయుని పేరు కూడా వినిపిస్తోంది.  ఈ ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా 
మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన బాలురు, బాలికలు ఆధ్యాత్మిక విద్యను చదువుకునేందుకు ఈ గురుకులంలో చేరారు. బాధితురాలు జూన్ 12న ఈ గురుకులంలో అడ్మిషన్ తీసుకుంది.  

అనంతరం మొదటి ఎనిమిది రోజులు బాగానే గడిచాయని, ఆ తరువాత తాను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను లోపలికి వచ్చి, తనను కొట్టేవాడని, తాకరాని చోట తాకేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరించాడని కూడా బాధితురాలు పేర్కొంది. ఆ సమయంలో ప్రీతేష్‌ ప్రభాకర్‌ తనను మాట్లాడవద్దని హెచ్చరించాడని, కోకరే తన పలుకుబడితో తన తండ్రిని, సోదరుడిని చంపేస్తాడని బెదిరించాడని బాధితురాలు వివరించింది.  

కాగా బాధితురాలు సోమవారం తన తండ్రికి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది.దీంతో అతను ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టంలోని సెక్షన్ 12, 17 కింద గురుకుల్ హెడ్‌ భగవాన్ కోకరే మహరాజ్‌తో పాటు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్‌లపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. కాగా మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ,  గురుకుల్ హెడ్‌ భగవాన్ కోకరే మహరాజ్‌ లైంగిక వేధింపులకు పలువురు బాలికలు గురై ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో సంబంధాలు కలిగిన రాజకీయ నేతల బండారం త్వరలోనే బయటపడనున్నదని భాస్కర్ జాదవ్ అన్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)