Breaking News

ఎమ్మెల్యే ‘పాచిపోయిన పప్పు’ వివాదం.. క్యాంటీన్ లైసెన్స్‌ సస్పెండ్

Published on Thu, 07/10/2025 - 09:13

ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్‌ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టింది.

ఎఫ్‌డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ ఉల్లంఘించించింది. హాస్టల్‌లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది.
 

శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్‌లో  ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్‌లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్‌లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు.  హోటల్‌పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)