Breaking News

నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు..

Published on Fri, 08/11/2023 - 16:56

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబందనల కింది ఈ మేరకు రెండు నెలల బెయిల్‌ ఇస్తూ తీర్పును వెలువరించింది.  నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్‌ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది. 

 పరారీలో ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో అక్రమమైన లావాదేవీలు ఉన్నయనే ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2022లోనే నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. 2021 అక్టోబర్‌లో ముంబయిలోని క్రూయిజ్‌ షిప్‌పై నార్కోటిక్ బ్యూరో మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాడి చేశారు. ఈ దాడిలో నవాబ్ మాలిక్ బంధువు సమీర్ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే మంత్రి నవాబ్ మాలిక్ అక్రమ లావాదేవీలు జరిపారనే కేసులో నిందితునిగా ఉన్నారు. 

ఈ ఏడాది జులైలోనే ముంబయి కోర్టు ఆయన బెయిల్ పిటీషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యంగా ఫిట్‌గానే ఉన్నారని పేర్కొంది. ఎలాంటి అనారోగ్యంతో బాధపడడంలేదని తెలిపింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్రమంగా దెబ్బతిన్నదని నవాబ్ మాలిక్ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో స్టేజ్‌2 నుంచి స్టేజ్ 3కి చేరుకున్నారని బెయిల్ ఇవ్వవలసిందిగా అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం రెండు నెలల బెయిల్ మంజూరు చేసింది. 

ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)