Breaking News

‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’

Published on Wed, 03/19/2025 - 21:54

ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌​ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నీవీస్ నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు. 

‘ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు. వారు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసి మరీ శిక్షిస్తాం. ఆఖరికి సమాధుల్లో దాక్కున్నా తప్పించుకోలేరు.  ఈ దాడిలో 33 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. ఇదొక అమానుష ఘటన అని, పక్క వ్యూహంతో హింసాత్మ ఘటనలకు పాల్పడ్డారన్నారు.

కాగా, ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్‌ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో సోమవారం  ఈ ఘర్షణ చెలరేగింది. తొలుత చిన్నపాటి ఘర్షణగా మొదలై, ఆపై తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి.  ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలపాలయ్యారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)