మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్‌ఎస్‌ఎస్‌ సర్వేలో ఏం తేలింది?

Published on Thu, 10/24/2024 - 08:18

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వే  నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.

ఆర్‌ఎస్‌ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్‌ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.

బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్‌, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)