Breaking News

కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు

Published on Sun, 01/05/2025 - 11:33

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.

కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే  కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి  ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు  హారతులతో కూడా మార్పులు చేసింది.

జనవరి 13  నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి  రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్‌(Kashi Vishwanath Dham)లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి,  శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.

మహాకుంభమేళా.. మహాశివరాత్రి(Mahashivratri)(ఫిబ్రవరి 26)తో ముగియనుంది.  ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి  11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది.  మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.

ఇది కూడా చదవండి: కనిపించని ఏసీ కోచ్‌.. కంగుతిన్న ‘రిజర్వేషన్‌’ ప్రయాణికులు.. తరువాత?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)