Breaking News

Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న ప్రధానులు వీరే

Published on Wed, 12/04/2024 - 09:38

ప్రయాగ్‌రాజ్‌: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు.

స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు.
 

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (1951)
భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.

ఇందిరా గాంధీ
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో  గుర్తింపు వచ్చింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి (2001)
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి విశేష కృషి చేశారు.

నరేంద్ర మోదీ (2019)
2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.

త్రివేణీ సంగమం కేంద్రంగా..
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్‌ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలు
గాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమం
జనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు.  జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన  గానంతో మ్యాజిక్‌ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్‌రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.

ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)