కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్‌రాజ్‌

Published on Mon, 01/06/2025 - 07:16

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి జరగబోయే మహాకుంభమేళాకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. నగరంలోని ప్రతీప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌ను అంత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది.

‘పెయింట్ మై సిటీ’ ప్రచారం పేరిట ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వేస్టేషన్‌ను అద్భుత కళ, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు.

స్టేషన్‌ గోడలపై హిందూ పురాణాలు, భారతీయ సంప్రదాయాలను వర్ణించే అందమైన, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలను రూపొందించారు.

ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ఝూన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చివ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ సంగమ్‌ రైల్వే స్టేషన్, సుబేదర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లన్నింటినీ అత్యంత సుందరంగా మలచారు.

రైల్వే స్టేషన్‌ గోడలపై రామాయణం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివ భక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు.

పలువురు కళాకారులు తమ జీవితానుభవాలను ఈ కళాకృతులలో ప్రతిబింబించారు.

ఈ కళాకృతులు భక్తులకు, పర్యాటకులకు ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపిస్తాయి. రైల్వేశాఖ చూపిన ఈ చొరవ కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రయాగ్‌రాజ్ చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది.

రైల్వేశాఖ చేపట్టిన  ‘పెయింట్ మై సిటీ’ కార్యక్రమం మహా కుంభమేళాను తిలకించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఋషి సంప్రదాయం, గురు-శిష్య సంప్రదాయం, జ్ఞానం, త్యాగాలకున్న ప్రాముఖ్యత ఈ కళాకృతులలో కనిపిస్తుంది.

ఈ కళాఖండాలు మహాకుంభమేళాకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

భారతీయ రైల్వే చేస్తున్న ఈ ప్రయత్నం ప్రయాగ్‌రాజ్‌ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ఎంతో వైవిధ్యతతో కూడిన ఈ  చిత్రాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


ఇది కూడా చదవండి: బీహార్‌లోనూ ఎర్రకోట.. చరిత్ర ఇదే

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)