Breaking News

Mahakumbh-2025: అంబాసిడర్‌ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన

Published on Sat, 01/11/2025 - 07:11

జనవరి 13 నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేళాకు దేశ విదేశాల నుండి స్వామీజీలు, బాబాల రాక మొదలయ్యింది. వీరిలో కొందరు బాబాలు అ‍క్కడి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇదేకోవలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు అంబాసిడర్‌బాబా.

మధ్యప్రదేశ్‌ నుంచి అత్యంత పురాతన అంబాసిడర్‌ కారులో వచ్చిన ఒక బాబా.. అంబాసిడర్‌ బాబా(Ambassador Baba)గా పేరొందారు. ఆయనను ఇక్కడివారు ఆశ్చర్యంగా గమనిస్తున్నారు. ఈ బాబా 52 ఏళ్ల క్రితం నాటి అంబాసిడర్ కారులో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఆయన తనకు తాను అంబాసిడర్ బాబా అని పేరు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ అంబాసిడర్‌ బాబా ఎవరనే మూలాల్లోకి వెళితే.. ఈయన అసలు పేరు మహంత్ రాజగిరి. ఈయన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు తరలి వచ్చారు. కుంభమేళా తరహాలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయన తన ఉనికిని చాటుకుంటారు. మహంత్ రాజగిరి తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఒక్క అంబాసిడర్‌ కారును మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు.

అంబాసిడర్ బాబా కొన్ని దశాబ్ధాలుగా ఈ కారులోనే నివసిస్తున్నారు. ఈ కారును ఆయన 35 ఏళ్ల క్రితం విరాళం(Donation)గా అందుకున్నారు. అప్పటి నుంచి మహంత్ రాజగిరి ఈ కారునే తన నివాసంగా చేసుకున్నారు. ఆయన ఈ అంబాసిడర్ కారుకు కాషాయ రంగు పెయింట్ వేయించారు. ఈ అంబాసిడర్ కారు 1972 మోడల్. అంబాసిడర్ బాబా గతంలో నాలుగు కుంభమేళాలకు ఈ కారులోనే హాజరయ్యారు. ఆయన ఈ కారులోనే తినడం, పడుకోవడం చేస్తుంటారు. ఈ కారు తనకు అమ్మలాంటిదని అంబాసిడర్‌ బాబా తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌ వచ్చిన ఆయన సంగమనగరి(Sangamnagari)లో ఒక గుడిసెలో బసచేస్తున్నారు. ఆ గుడిసె ముందర తన అంబాసిడర్‌ కారును నిలిపివుంచారు. ఈ కారులోనే కూర్చుని ఆయన ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘డిజిటల్‌ మహాకుంభ్‌’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)