Breaking News

మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి

Published on Sat, 09/28/2024 - 07:52

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మహాకాళేశ్వరం ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతిచెందారు. ఆలయానికున్న గేట్ నంబర్ నాలుగుకు ముందు మహాకాళ్‌ లోక్ ఫేజ్ టూ సమయంలో నిర్మించిన గోడపై మరొక గోడను నిర్మిస్తున్నారు. భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయింది.  

ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, గోడలోని కొంత భాగం కూలిపోగా, దాని కింద నలుగురు సమాధి అయ్యారని ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులను శిథిలాల నుంచి రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. మృతులను ఫర్హీన్ (22), అజయ్ యోగి (27)గా గుర్తించినట్లు సీఎంహెచ్‌వో ఏకే పటేల్ తెలిపారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ‘కేజ్రీవాల్‌ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)