Breaking News

మౌని అమావాస్య.. త్రివేణి సంగమ స్థలిలో కీలక ఘట్టం

Published on Wed, 01/29/2025 - 05:03

సాక్షి న్యూఢిల్లీ: మహా కుంభమేళా(Maha Kumbh)లో మరో కీలక ఘట్టానికి త్రివేణి సంగమ స్థలి సిద్ధమైంది. బుధవారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనకోటి మునుపెన్నడూలేనంత పెద్ద ఎత్తున తరలివస్తోంది. బుధవారం ఒక్కరోజే సుమారు పది కోట్ల మంది భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విస్తృతస్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రోజూ కోటి, కోటిన్నర మంది భక్తులు మేళాకు వస్తుండగా బుధవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో వచ్చినాసరే తోపులాటల వంటి ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం తగు ఏర్పాట్లుచేసింది.

గంగానది ప్రవాహం పొడవునా ఎక్కడైనా స్నానం ఆచరించేలా మరిన్ని ఘాట్‌లను స్నానాలకు అనువుగా అందుబాటులోకి తెచ్చింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే సామాన్యులు, సన్యాసులు, సంతులు, సాధువులు, నాగ సాధువులు, కిన్నెరలు తరలివస్తున్నారు. నేడు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వస్తోంది. దీంతో ఈరోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని కోట్లాది మంది ఆసక్తిగా కనబరుస్తున్నారు. అమృత స్నానం(రాజ స్నానం) తర్వాత దానధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శివుడిని స్మరించుకుంటూ భక్తులు తమ పూర్వీకులకు నీరాజనాలు అర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇప్పటి వరకు పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 15 కోట్లు దాటగా బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ఒక్కరోజే పది కోట్లు భక్తులు వచ్చే అవకాశముంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌