Breaking News

Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే..

Published on Tue, 01/07/2025 - 10:11

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఇందుకు బారీఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు సాధుసన్యాసులతో పాటు సామాన్యులు కూడా లక్షలాదిగా తరలిరానున్నారు. సంగమతీరంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.

కుంభమేళా(Kumbh Mela) సందర్భంగా ఇప్పుటికే పలువురు బాబాలు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. వీరిలో ఒకరే హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. ఇతనిని చాబీవాలే బాబా(తాళాల బాబా) అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళంచెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్‌రాజ్‌లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు.

తాళాల బాబా మీడియాతో మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు  సన్యాసమార్గం అవలంబించారు. వారు నాకు హరిశ్చంద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం(Spiritual life journey) ప్రారంభించాను. హరిశ్చంద్రుడు మనందరికీ సన్మార్గాన్ని చూపాడు. నేను హరిశ్చంద్రుడు అందించిన మార్గాన్ని అనుసరిస్తున్నాను.  ఇందుకోసం చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాను.

సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలు, ద్వేషాలను తొలగించడంలో తనవంతు పాత్రను పోషించేందుకే ఇంటిని విడిచిపెట్టానని బాబా తెలిపారు. నా జీవన మార్గంలో లెక్కకుమించినన్ని పాదయాత్రలు చేశాను. ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ సత్యమార్గాన్ని విడవకుండా ముందుకు సాగుతున్నాను. రాబోయే మహాకుంభ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ, సీఎం యోగి అమితమైన కృషి చేస్తున్నారు. తాను ధరించిన తాళాలు హృదయరాముని దర్శింపజేస్తాయని’ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్‌లు.. కరోనాకు ముందే..

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)