ఉప ఎన్నిక రగడ.. మిశ్రా ఎపిసోడ్‌తో బీజేపీకి తలనొప్పి!

Published on Sat, 07/11/2026 - 09:35

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని దాతియా అసెంబ్లీ ఉపఎన్నిక బీజేపీలో అంతర్గత కలకలానికి కారణమైంది. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతియా నుంచి ఆశుతోష్ తివారీని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానికంగా నిరసనలు భగ్గుమన్నాయి.

అయితే, దాతియా నియోజకవర్గంలో నరోత్తమ్ మిశ్రాకు బలమైన రాజకీయ పట్టు ఉందని భావిస్తున్న ఆయన వర్గం, ఉపఎన్నికలో ఆయనే బీజేపీ అభ్యర్థిగా ఉంటారని ఆశించింది. అయితే పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా ఆశుతోష్ తివారీ పేరును ప్రకటించడంతో మిశ్రా మద్దతుదారుల్లో అసంతృప్తి మొదలైంది.

టికెట్ ప్రకటన అనంతరం దాతియాలో పలుచోట్ల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొందరు మద్దతుదారులు రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఝాన్సీ–గ్వాలియర్ హైవేను దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. నరోత్తమ్ మిశ్రాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దాతియా జిల్లా అధ్యక్షుడు సహా పలువురు స్థానిక పార్టీ పదాధికారులు సామూహిక రాజీనామా చేసినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.

నరోత్తమ్ మిశ్రా మధ్యప్రదేశ్‌ బీజేపీలో కీలక నేతగా ఎదిగిన సీనియర్ రాజకీయ నాయకుడు. దాతియా నియోజకవర్గం నుంచి ఆయనకు ప్రత్యేక రాజకీయ గుర్తింపు వచ్చింది. 1960లో జన్మించిన నరోత్తమ్ మిశ్రా బీజేపీలో దీర్ఘకాలంగా పనిచేస్తూ పలు కీలక పదవులు నిర్వహించారు. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో హోం శాఖ, న్యాయ శాఖ, జైళ్లు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన ప్రభావశీల మంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. దాతియా రాజకీయాల్లో నరోత్తమ్ మిశ్రాకు బలమైన పట్టు ఉండేది. ఆయన దాతియా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర భారతి చేతిలో ఓటమి చవిచూశారు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)