Breaking News

మద్రాస్‌ హైకోర్టులో హీరో విజయ్‌ ‘జన నాయగన్‌’కు భారీ ఊరట

Published on Fri, 01/09/2026 - 11:16

సాక్షి,చెన్నై: తమిళ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుండి భారీ ఊరట లభించింది. ఆయన నటించిన జన నాయగన్ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రివ్యూ కమిటీకి పంపకుండానే హైకోర్టు నేరుగా అనుమతి ఇచ్చింది. కోర్టు స్పష్టంగా జన నాయగన్ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

మద్రాస్ హైకోర్టు తీర్పుతో జన నాయగన్ విడుదలకు మార్గం సుగమమైంది. సంక్రాంతి రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

గతేడాది డిసెంబర్‌లో జన నాయగన్‌ నిర్మాతలు సినిమా విడుదల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును ఆశ్రయించారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేసింది. ఈ ఆలస్యంపై జననాయగన్‌ నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఇదే అంశంపై ఈ బుధవారం విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తాజా విచారణలో సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఫిర్యాదు దారుడి గోడు విన్న తర్వాత కూడా సెన్సార్‌ ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లుగా ఉంది. 

అంటే, సీబీఎస్‌ఈ మొదట్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా దరఖాస్తును స్వీకరించింది. కానీ తరువాత, విడుదలకు దగ్గరగా వచ్చేసరికి కొత్తగా అభ్యంతరాలు పెట్టింది. ఇది ముందే ఉన్న అసలు సమస్య కాకుండా, తరువాత కల్పించిన సమస్యలా ఉందని కోర్టు భావించింది. అంతేకాదు, సర్టిఫికేషన్ ప్రక్రియలో అనవసరమైన ఆటంకాలు సృష్టించడం తగదని కోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. అనంతరం, సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సీబీఎస్‌ బోర్డుకు సూచించింది. దీంతో జన నాయగన్‌ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. 

విజయ్ నటించిన చిత్రాలు తరచుగా రాజకీయ చర్చలకు దారితీస్తాయి. జన నాయగన్ కూడా సమాజంలోని సమస్యలను ప్రతిబింబించేలా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో సీబీఎఫ్‌సీ ఆలస్యం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి.ఈ తీర్పు సినీ పరిశ్రమలో సెన్సార్ బోర్డు పాత్రపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛను కాపాడే ప్రయత్నంగా కోర్టు నిర్ణయం కనిపిస్తుండగా, మరోవైపు సర్టిఫికేషన్ ప్రక్రియలో పారదర్శకత అవసరం ఉందని స్పష్టమవుతోంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)