రూ.90 వేల కోసం సొంత మామనే హతమార్చి.. ఆ తర్వాత..

Published on Mon, 07/17/2023 - 19:43

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. రూ.90 వేల అప్పు తీర్చమని అడిగినందుకు సొంత మేనమామనే కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. 

స్థానికంగా జిల్లాలో వివేక్ శర్మ(45) వ్యాపారిగా స్థిరపడ్డాడు. ఈ క్రమంలో తన మేనల్లుడు మోహిత్‌కు అప్పుగా రూ.90 వేలను ఇచ్చాడు. డబ్బు చెల్లించమని అడిగినా ప్రయోజనం లేకపోవడంతో వివేక్‌ శర్మ నేరుగా మోహిత్ ఇంటికే వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని మోహిత్‌.. వివేక్‌ను హత్య చేయాలని పథకం పన్నాడు. టీలో మత్తు మందు ఇచ్చి, అపస్మారక స్థితికి వెళ్లాక.. వివేక్ శర్మ దేహాన్ని ముక్కలుగా కోశాడు. ఆనంతరం సంచుల్లో వేసి సమీపంలో ఉన్న ఓ ఆనకట్ట వద్ద పూడ్చి పెట్టాడు. 

వివేక్ శర్మ తిరిగిరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.  విచారణలో తాను హత్య చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు.  శరీరభాగాలు పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు.. మృత దేహాన్ని వెలికితీశారు. శరీర భాగాలలోని చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా అది వివేక్‌దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం మృతుని శరీర భాగాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. 

ఇదీ చదవండి: టోల్‌ గేట్ ఉద్యోగినిపై దాడి.. జుట్టు పట్టి లాగి..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)