Breaking News

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

Published on Sun, 07/14/2024 - 14:55

భోపాల్‌: దేశ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్‌ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్‌ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

వివరాల ప్రకారం..  రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. జస్టిస్‌ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్‌ రోహిత్ ఆర్య బెయిల్‌ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.

అలాగే,  2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)