Breaking News

హనుమంతుడి వారసులం అని గర్వపడండి!: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Published on Sat, 06/10/2023 - 17:05

ధార్‌ జిల్లాలోని గంద్వానీకి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్‌ మాజీ అటవీ మంత్రి ఉమంగ్‌ సింఘర్ హనుమంతుడు ఆదివాసీయే అని వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం అయిన రామాయాణ మహా కావ్యంలో కోతులుగా వర్ణించబడినవారు హనుమంతుని వలే గిరిజనులేనని అన్నారు. ఈ మేరకు ఆయన ధార్‌ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమంతుని గురించి ఈ విధంగా ప్రసంగించారు.

రాముడిని లంకకు తీసుకువెళ్లింది ఆదివాసీలు(వానర సేన) అని రామయణ కథలో రాశారు. దీనిని బట్టి ఆదివాసీలు అరణ్యాల్లో నివశించారని ఆ కథ ద్వారా మనకు తెలుస్తోంది కావున హనుమంతుడు కూడా ఆదివాసీయే. అందువల్ల మనం అతని వారసులం అని గర్వపడండి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సింఘర్‌ అన్నారు. దీంతో మధ్యప్రదేశ్‌ అధికార ప్రతినిధి హితేష్‌ బాజ్‌పాయ్‌ మండిపడుతూ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. వారు హనుమాన్‌ జీని దేవుడిగా భావించరు.

హనుమంతుడుని హిందువులు పూజించే దేవుడిగా అస్సలు గుర్తించరు అని ఫైర్‌ అయ్యారు. హనుమంతుడిని అవమానించారంటూ ఆరోపణలు చేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్‌ ఆలోచన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ క్యాథలిక్‌ మత గురువులు భాష మాట్లాడుతున్నట్లుంది అని వెటకరించారు. ఇక మత మార్పిడిలు చేసేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్‌ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి హితేష్‌ బాజ్‌పాయ్‌. 

(చదవండి: పాతికేళ్ల ఎన్సీపీ.. పవార్‌ కీలక నిర్ణయం.. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)