Breaking News

‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!

Published on Sun, 04/20/2025 - 09:10

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్‌ కోసం రావాలని ఛాయాకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్‌.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.

అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్‌, ఆదర్శ్‌ను అరెస్ట్‌ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)