Breaking News

ఎన్నికల ముంగిట.. వంట గ్యాస్‌పై శుభవార్త!

Published on Thu, 03/07/2024 - 13:51

లోక్‌సభ ఎన్నికల ముంగిట వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద భారత ప్రభుత్వం వంట గ్యాస్‌పై సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించవచ్చని సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక పేర్కొంది. 

కొత్త కనెక్షన్‌ల కోసం అందించే సొమ్మే కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అర్హులైన వినియోగదారులకు ప్రతి ఎల్‌పీజీ సిలిండర్‌కు రూ.300 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ అందిస్తోంది. ఇది గతంలో రూ.100 ఉండగా 2023 అక్టోబరులో రూ.300కి పెంచారు. సబ్సిడీని ఒక సంవత్సరం పొడిగించడం వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.12,000 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

ఉజ్వల పథకం ప్రయోజనాలు ఇలా..
ప్రభుత్వం అర్హులైన పేదలకు 14.2 కిలోల సిలిండర్‌తో ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్‌కు రూ.1600 నగదు బదిలీ చేస్తుంది. ఇదే 5 కిలోల సిలిండర్‌కైతే రూ.1150 అందిస్తోంది. ఇందులో సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ - 14.2 కిలోల సిలిండర్‌కు రూ.1250, 5 కిలోల సిలిండర్‌కైతే రూ.800, రెగ్యులేటర్ కోసం రూ.150, ఎల్‌పీజీ ట్యూబ్‌ కోసం రూ.100, డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్ కోసం రూ.25, ఇన్‌స్పక్షన్‌, ఇన్‌స్టాలేషన్ చార్జీ కింద రూ.75 ఉంటాయి. వీటన్నంటినీ ప్రభుత్వమే భరిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)