సంక్రాంతి చలి పంజా.. ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

Published on Fri, 01/10/2025 - 09:24

సాక్షి, ఢిల్లీ/అమరావతి: దేశంలో చలి తీవ్రత పెరిగింది. అలాగే, దట్టమైన పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉత్తరాది సహా తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక, ఢిల్లీలో జీరో విజిబిలిటీ కారణంగా పలు విమాన సర్వీసులు, రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. శుక్రవారం ఉదయం కాలుష్యం 408(ఎక్యూఐ)పాయింట్లకు చేరుకున్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. దీంతో​, గ్రాఫ్‌-3 అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి వరుసగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. రహదారులు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ మంచు కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శుక్రవారం ఉదయం పలుచోట్ల ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
 

 

మరోవైపు.. ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, జమ్ము కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్ర పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు. ఇక, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు లోయలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు తెలిపారు. పొగమంచు దట్టంగా కురుస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. డల్లపల్లి 7.2, మినుములూరులో 8.5 డిగ్రీలుగా ఉంది.

తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ సహా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లో 6.8 డిగ్రీలుగా నమోదు అయ్యింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)