Breaking News

ఉదయం గర్ల్‌ఫ్రెండ్‌.. సాయంత్రం మరొకరు..

Published on Wed, 03/26/2025 - 07:19

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌ జిల్లా హర్పూర్‌ బుధాట్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్‌ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్‌ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.

ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్‌ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి జితేంద్ర కుమార్‌ తెలిపారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)