Breaking News

హోటల్‌ గదిలో ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు.. తరువాత ఏం చేశాడంటే...

Published on Mon, 05/29/2023 - 11:21

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఒక ప్రేమికుడు పెళ్లయిన తన ప్రియురాలిని దారుణంగా హతమార్చడమే కాకుండా క్షణికావేశంలో మరో పని కూడా చేశాడు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లోగల ఒక హోటల్‌లో ఒక యువకుడు తన ప్రియురాలిని హతమార్చడమే కాకుండా తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుడు తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఆ ప్రియురాలి భర్తకు వీడియో కాల్‌ చేసి, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియజేశాడు. ఈ సమాచారం అందుకోగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆ రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన ప్రియురాలిని తీసుకుని ఆదివారం ఉదయం కదరాబాద్‌లోని ఒక హోటల్‌కు చేరుకున్నాడు. వారిద్దరూ ఒక రూమ్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన ఉదంతం గురించి ఆ యువతి భర్త మాట్లాడుతూ.. తన భార్య మధు(22)ను హోటల్‌ గదిలో ఆమె ప్రియుడు హిమాంశు(20) హత్య చేశాడని తెలిపారు. ఈ సందర్భంగా హోటల్‌ సిబ్బంది మాట్లాడుతూ తాము ఆ గదిలోకి చూసి హడలిపోయామన్నారు. గదిలో బెడ్‌ మీద మధు మృతదేహం పడివుండగా, హిమాంశు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడన్నారు. వెంటనే హోటల్‌ సిబ్బంది పోలీసులకు ఈ సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతురాలి భర్త పోలీసులతో మాట్లాడుతూ  హిమాంశు తన భార్య మధును హత్య చేశాడని తెలిపారు. ఈ సమాచారం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు హోటల్‌కు చేరుకున్నారు. కాగా మధుకు కొన్నేళ్ల క్రితం హిమాంశు ఉంటున్న గ్రామంలోని మరో యువకునితో వివాహం జరిగింది. తరువాత మధు, హిమాంశు మధ్య సంబంధం ఏర్పడింది. అయితే కొంతకాలం తరువాత మధు భర్త మృతి చెందాడు. అయితే మధు కుటుంబీకులు వెంటనే ఆమెకు మరో యువకునితో వివాహం జరిపించారు. ఆ తరువాత కూడా మధు, హింమాశు మధ్య సంబంధం కొనసాగింది. ఇప్పుడు వారిద్దరి మృతదేహాలు హోటల్‌లో లభ్యమయ్యాయి. 
 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)