Breaking News

ప్రేయసి ఇంట ఉత్కంఠ.. ప్రియుడు హత్య.. యువతి, మామ ఆత్మహత్యాయత్నం

Published on Thu, 10/30/2025 - 10:32

హమీర్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. తన ప్రియురాలికి బలవంతపు వివాహం చేస్తున్నారని తెలుసుకున్న ప్రియుడు వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నాడు. అతనిని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి, హత్య చేశారు. ఇంతలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకోవడంతో అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో  తన ప్రియురాలు మనీషా(18)కు బలవంతంగా పెళ్లి జరుగున్నదని తెలుసుకున్న ఆమె ప్రియుడు రవి(35) ఆమెను కలుసుకునేందుకు  ఆమె ఇంటికి వచ్చాడు. దీనిని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని కట్టేసి, కర్రలతో దాడి చేశారు. వీరికి గ్రామస్తులు కూడా సహకరించారు. తీవ్రంగా గాయపడిన రవి దాహంతో నీరు అడిగినా వారు నిరాకరించారు. ఈ తరుణంలోనే రవి మృతిచెందాడు.

దీంతో హత్యారోపణలు ఎదురైన మనీషా మామ పింటూ(35) ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే బాధితులు రవి, పింటూలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.  రవి చనిపోయాడని అక్కడి వైద్యులు దృవీకరించారు. విషయం తెలుసుకున్న మనీషా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ‍ప్రస్తుతం ఆమె, ఆమె మామ పింటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని మౌదాహాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ వైద్యులు తెలిపారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. 

ఈ ఘటన దరిమిలా మనీషా అమ్మమ్మ  మీడియాతో మాట్లాడుతూ తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే రవి ఇక్కడకు వచ్చాడని, తరువాత పింటూను కత్తితో పొడిచాడని తెలిపింది. గతంలో ఒకసారి రవితో మనీషా వెళ్లిపోయిందని, అయితే తాము బలవంతంగా మనీషాను తీసుకురావడంతో అతను తమ కుటుంబంపై ఆగ్రహంతో ఉన్నాడని ఆమె పేర్కొంది. ఇదే ఘటన గురించి మనీషా అత్త, పింటు భార్య  మాట్లాడుతూ ఇంటిలోనికి వచ్చిన రవిని తన భర్త గట్టిగా పట్టుకోగా, అతను కత్తితో తన భర్తను పొడిచాడని పేర్కొంది.

ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. హమీర్‌పూర్‌లోని పోలీసు సూపరింటెండెంట్ దీక్షా శర్మ మాట్లాడుతూ పర్చ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగిందని, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని, మరొకరు గాయపడ్డారని తెలిపారు. మనీషా అనే యువతి తనను తాను గాయపరచుకుని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: మరో వివాదంలో ప్రశాంత్‌ కిశోర్‌.. రెండు చోట్ల ఓటు.. టీఎంసీ ఆఫీసే చిరునామా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)