Breaking News

రోజుకో మలుపు తిరుగుతున్న డీకే శివకుమార్‌ సీబీఐ కేసు

Published on Fri, 01/05/2024 - 16:48

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది.

దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్‌ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు.

అడ్వకేట్‌ జనరల్‌ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్‌ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు. 

ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్‌ వివాదం: మాజీ పిటిషనర్‌ ఇక్బాల్‌కు ఆహ్వానం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)