Breaking News

ప్రజ్వల్‌ రేవణ్ణపై లుక్‌ అవుట్‌ నోటీసులు..

Published on Thu, 05/02/2024 - 17:19

సాక్షి, హైదరాబాద్‌:  మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణనకు వేగవంతం చేసింది. గురువారం ప్రజ్వల్‌పై సిట్‌ బృందం.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్‌ చేసే విధంగా సిట్‌ వారెంట్‌ జారీ చేసింది.

  దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్‌ పాయింట్లకు లుక్ అవుట్ సర్క్యులర్ ఇ​చ్చింది. ప్రజ్వల్‌ రేవణ్ణ విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్‌పోస్ట్‌ కనిపిస్తే.. నిర్బంధించాలని తెలిపింది. కాగా హసన్‌ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ సంబంధించినవిగా కొన్ని అసభ్యకర వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.  

లైంగిక వేధింపులపై పలువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్‌ విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. 

అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ రేవణ్ణ సిట్‌ అధికారులను కోరారు. ‘సిట్‌ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్‌’లో సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. అయితే, ప్రజ్వల్‌ అభ్యర్థనను సిట్‌ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ప్రజ్వల్‌ను జేడీఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)