Breaking News

బీజేపీ నేతపై లుక్‌అవుట్ నోటీసులు

Published on Tue, 09/26/2023 - 13:00

చంఢీగర్‌: పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బటిండా ఆస్తుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మన్‌ప్రీత్ దేశం వీడి వెళ్లొచ్చని భావించారు అధికారులు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద అలర్ట్ జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. 

బాదల్‌తో పాటు, భటిండా డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రాజీవ్‌ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లు కూడా ఈ కేసులో భాగం పంచుకున్నట్లు తెలుస్తోంది. 

భటిండాలోని ఆస్తి కొనుగోలులో అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సరూప్ చంద్ సింగ్లా 2021లో చేసిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ బ్యూరో విచారణ ప్రారంభించింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌లో ఉన్న సింగ్లా.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న బాదల్ తన పదవిని దుర్వినియోగం చేసి రెండు కమర్షియల్ ప్లాట్‌లను రెసిడెన్షియల్ ప్లాట్‌గా మార్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే.. ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: Rahul Gandhi Train Journey Video: రాహుల్‌ గాంధీ జన్‌కీ బాత్‌.. ఈసారి రైలులో..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)