హోమ్‌లోన్ భారం.. లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ ఆత్మహత్య?

Published on Wed, 08/05/2026 - 15:29

సాక్షి,న్యూఢిల్లీ: హోమ్‌లోన్ భారం లోక్‌సభ సచివాలయ డైరెక్టర్‌ ప్రాణాన్ని సైతం బలి తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ సచివాలయంలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గౌరవ్ గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు ముందు ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ లేఖలో సుమారు రూ. 70 లక్షల హోమ్‌లోన్ బాకీ ఉన్నట్లు, అదే తన మరణానికి ప్రధాన కారణమని పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. లోక్‌సభ సచివాలయంలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న గౌరవ్ గౌతమ్, సెక్టార్ 82లోని కేంద్రీయ విహార్-II సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలోనే అపస్మారక స్థితిలో కనిపించారు. ఆ సమయంలో గౌతమ్ భార్య పుట్టింటికి వెళ్లారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్లాట్ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి చూడగా ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆయన్ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గౌతమ్ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

హోమ్‌లోన్ భారం పెరిగిపోవడం, ఇంకా రూ. 70 లక్షల వరకు రుణం చెల్లించాల్సి ఉండటమే ఈ తీవ్ర నిర్ణయానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందం, స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. గౌతమ్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)