Breaking News

Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం

Published on Tue, 08/06/2024 - 05:53

న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్‌ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్‌ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.

 రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్‌ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్‌ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్‌ తంతు మొత్తం ముగుస్తుంది.  

ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు 
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్‌ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్‌ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్‌ వంటి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)