Breaking News

Rahul Gandhi: ఎస్సీ, ఎస్టీ మహిళల ఖాతాలో లక్ష

Published on Tue, 04/09/2024 - 06:22

సివనీ/షాదోల్‌: కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ఎస్సీ, ఎస్టీ మహిళ బ్యాంక్‌ ఖాతాకు ఏటా రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సివనీ జిల్లాలోని ధనోరాలో ర్యాలీలో గిరిజనులనుద్దేశిస్తూ రాహుల్‌ మాట్లాడారు.‘‘ కేంద్రప్రభుత్వ విభాగాల్లో కీలకమైన ప్రభుత్వ పదవుల్లో 90 మంది ఐఏఎస్‌ అధికారులుంటే వారిలో కేవలం ఒకే ఒక్క గిరిజనుడు ఉన్నాడు. దేశజనాభాలో గిరిజనులు ఎనిమిది శాతంకంటే ఎక్కువే ఉంటారు.

అయినా దేశంలోని టాప్‌ 200 కంపెనీల్లో ఒక్కదానికి కూడా గిరిజనులు యజమానులుగా లేరు. కనీసం ఆ సంస్థల్లో అత్యున్నత స్థాయి అధికారులుగానూ లేరు. దేశంలో ఒక్క మీడియా సంస్థకైనా ఆదివాసీ యజమానిగా ఉన్నారా? ఒక్కరైనా న్యూస్‌యాంకర్‌ ఉన్నారా?’ అంటూ గిరిజనుల అభ్యున్నతికి మోదీ సర్కార్‌ కృషిచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఏడాదిలోపు ఆదివాసీల భూ హక్కుల సమస్యను పరిష్కరిస్తాం. కేంద్ర ఉద్యోగాల్లో కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం పాడి 30 లక్షల కేంద్ర ఉద్యోగాలను భర్తీచేస్తాం’ అని అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)