Breaking News

Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం

Published on Fri, 03/22/2024 - 04:58

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో ఆ సమస్త వివరాలను ఈసీ వెంటనే తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లతోసహా దాతలు, వాటిని అందుకున్న గ్రహీతల(రాజకీయ పార్టీలు) జాబితాను విడివిడిగా ఈసీ పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లను బట్టి ఏ ఎలక్టోరల్‌ బాండ్‌ మొత్తాన్ని ఈ రాజకీయ పార్టీ విరాళంగా పొందిందో సులభంగా తెల్సుకోవచ్చు.

సుప్రీంకోర్టు గత ఆదేశాల సమయంలో ఈ ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లు లేకుండానే బాండ్లు, వాటి గ్రహీతల జాబితాను ఈసీకి ఎస్‌బీఐ ఇచ్చింది. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. సమస్త వివరాలను ఈసీకి ఇవ్వాలని ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎస్‌బీఐ గురువారం ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను ఈసీకి అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.  

రిలయన్స్‌ సంబంధ సంస్థ నుంచి బీజేపీకి రూ.395 కోట్లు
ఈసీ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న క్విక్‌ సప్లై చైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బీజేపీకి రూ.395 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2022లో శివసేన
పార్టీకి రూ.25 కోట్ల విరాళాలు అందజేసింది. 2021–22, 2023–24కాలంలో బాండ్లు కొని విరాళంగా ఇచి్చన మూడో అతిపెద్ద దాతగా క్విక్‌ సప్లై చైన్‌ నిలిచింది. ఈకాలంలో ఈ సంస్థ రూ.410 కోట్ల బాండ్లను కొనుగోలుచేసింది. అత్యధికంగా ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థ రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలుచేయడం తెల్సిందే.

ఈ సంస్థ 2022 అక్టోబర్‌ వరకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీపార్టీకి రూ.540 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా టీఎంసీ నిలిచింది. ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌హోటల్‌ సర్వీసెస్‌ నుంచి బీజేపీ రూ.100 కోట్ల విరాళాలు పొందింది. ఈ సంస్థ కాంగ్రెస్‌కు రూ.50 కోట్ల విరాళం ఇచ్చింది.  సిక్కిం క్రాంతికారీ మోర్చా సైతం ఈ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించింది. తమిళనాడులోని డీఎంకేకు ఈ సంస్థ ఏకంగా రూ.509 కోట్ల విరాళాలు ఇచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న హానీవెల్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సైతం రూ.30 కోట్ల బాండ్లను కొని మొత్తం బీజేపీకే విరాళంగా ఇచ్చింది.

ఈసీకి ఇచ్చేశాం: ఎస్‌బీఐ
ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా ఎన్నికల సంఘానికి అందజేశామని ఎస్‌బీ ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖరా గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దాతలు ఇచ్చిన బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల బ్యాంక్‌ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బయటపెట్టడం లేదని వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)