Breaking News

Lok sabha elections 2024: ‘రహస్య వ్యూహం’ ఏమిటో?

Published on Sat, 05/04/2024 - 05:18

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ని్రష్కమించాక ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని గంపెడాశ పెట్టుకున్న స్థానిక నాయకత్వంపై ఏఐసీసీ నీళ్లు చల్లింది. రాయ్‌బరేలీ లేదా అమేథీలో ప్రియాంక కచి్చతంగా పోటీచేస్తారని తెగ ప్రచారం జరిగినా చివరకు ఆమె పోటీకి నిలబడకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు. ప్రియాంకను పోటీలో ఉండకపోవడం వెనుక ‘రహస్య వ్యూహం’ ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో అదేమిటన్న ఆసక్తి మరింత ఎక్కువైంది.  

అరంగేట్రం వయా ఉప ఎన్నిక ! 
వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక బలంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయినాసరే దశాబ్ధాలుగా రాయ్‌బరేలీతో అనుబంధం పెంచుకున్న గాం«దీలు కచి్చతంగా పోటీచేయాలని స్థానిక నేతల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ సైతం ఇదే డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో చివరికి రాహుల్‌ పోటీకి అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా ఎన్నికయ్యారు. 

రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్‌ పోటీ చేసి గెలిస్తే పార్లమెంట్‌లో ముగ్గురు గాం«దీలు ఉంటారని, ఇది వారసత్వ రాజకీయాలను వ్యతి రేకిస్తున్న బీజేపీకి పెద్ద అస్త్రంగా మారుతుందన్న ఉద్దేశ్యంతో ప్రియాంక పోటీ నుంచి తప్పుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో రాహుల్‌ గెలిస్తే రాయ్‌బరేలీలో రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి వచ్చే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక రాజకీయ అరంగ్రేటం చేస్తారని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రియాంకగాంధీ దేశమంతా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఒక్క రాయ్‌బరేలీ నియోజకవర్గానికే పరిమితం చేయకూడదన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.  
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)