Breaking News

ఎన్నికలకు ఎన్డీయే సర్వసన్నద్ధం

Published on Sun, 03/17/2024 - 04:40

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈసారి కూడా తమ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో పలు పోస్టులు చేశారు.

‘మరోసారి మోదీ సర్కారు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. గత పదేళ్ల తమ పాలనలో భారత్‌ ఎంతగానో అభివృద్ధి చెందిందని, వైభవోజ్వల మార్పును చూసిందని ఉద్ఘాటించారు. 140 కోట్ల మంది భారతీయుల శక్తియుక్తులతో అభివృద్ధిలో దేశం కొత్త రికార్డులు సృష్టించిందని హర్షం వ్యక్తంచేశారు. ప్రజలకు సుపరిపాలన అందించామని పేర్కొన్నారు. ఈ ట్రాక్‌ రికార్డును ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకగా అభివరి్ణంచారు.

ప్రధానమంత్రిగా వరుసగా మూడో పర్యాయం బాధ్యతలు చేపడతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి పేదరికం, అవినీతిపై యుద్ధం వేగవంతం చేస్తానని తేలి్చచెప్పారు. సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయడం తన ధ్యేయమని పేర్కొన్నారు. మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందని వెల్లడించారు. దేశ ప్రగతి కోసం రాబోయే వెయ్యి సంవత్సరాలకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను వచ్చే ఐదేళ్లలో తయారు చేసుకోవాలని చెప్పారు.  

ప్రజల ఆశీస్సుల నుంచే నాకు కొత్త శక్తి   
దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత 70 ఏళ్లు పాలించిన ప్రభుత్వాలు సృష్టించిన ఖాళీలను గత పదేళ్ల భర్తీ చేశామని ప్రధాని మోదీ తెలియజేశారు. దేశం సౌభాగ్యవంతంగా మారుతుందని, స్వావలంబన సాధిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో పెంచామని వివరించారు. ‘వికసిత్‌ భారత్‌’ అనే లక్ష్య సాధనకు మనమంతా కలిసికట్టుగా పని చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

మన దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకోవడానికి, మన యువత కలలను సాకారం చేయడానికి మరింత పట్టుదలతో కృషి చేద్దామని సూచించారు. ప్రతిపక్షాల పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు వెళ్లడానికి విపక్షాలకు ఒక బలమైన అంశమే లేదన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న తమను దూషించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తప్ప విపక్షాలకు ఇంకేమీ తెలియదని విమర్శించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)