Breaking News

Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్‌ రింగ్‌

Published on Thu, 05/02/2024 - 00:40

లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ లోక్‌సభ స్థానంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్‌ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. 

విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్‌ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్‌ సింగ్‌ ప్రకటించారు. 

ఓటింగ్‌ పెంచేందుకే.. 
మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్‌ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్‌ నియోజకవర్గంలో 3,097 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 

ప్రతి బూత్‌ వద్ద ఒక బీఎల్‌వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్‌ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్‌ నంబర్‌ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్‌ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్‌ సెట్లు, రెండు మొబైల్‌ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తొలి ఓటర్‌ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)