CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
Lok sabha elections 2024: ‘మూడో విడత’కు నేడు నోటిఫికేషన్
Published on Fri, 04/12/2024 - 06:23
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్సభ స్థానాల్లో మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితోపాటు అభ్యర్థి మృతితో రెండో విడతలో వాయిదా పడిన మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నియోజకవర్గానికి మే 7నే పోలింగ్ ఉంటుంది. శుక్రవారం మూడో విడత ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ వచ్చాక నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది.
ఈ 94 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 20న ఉంటుంది. మూడో విడతలో అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్తదితర రాష్ట్రాల్లో మే 7న ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్లోని విజాపూర్, ఖంభట్, వఘోడియా, మానవదర్, పోర్బందర్ అసెంబ్లీ స్థానాలతో పాటు, పశి్చమబెంగాల్లోని భగవాన్గోలా, కర్ణాటకలోని షోరాపూర్ (ఎస్టీ) అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది.
Tags : 1