Breaking News

Lok sabha elections 2024: లాలూ వర్సెస్‌ రోహిణి!

Published on Fri, 05/03/2024 - 01:16

పాట్నా: ఆర్జేడీ దిగ్గజం లాలు ప్రసాద్‌ యాదవ్‌ కూతురు రోహిణీ ఆచార్య తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతుండటం తెలిసిందే. బిహార్‌లోని సరన్‌ నియోజకవర్గం ఆమె పోటీ చేస్తున్నారు. అయితే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా అక్కడి నుంచే ఆమెపై పోటీ పడుతున్నారు! తండ్రీ కూతుళ్లు ఒకరిపై ఒకరు పోటీ పడటం ఏమిటా అని అవాక్కవుతున్నారా? వాళ్లిద్దరూ సరన్‌ నుంచి పోటీ చేస్తున్నది నిజమే గానీ సదరు లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఆమె తండ్రి కాదు. ఆ పేరుతోనే ఉన్న ఓ రైతు!

 రాష్రీ్టయ జన సంభావనా పార్టీ (ఆర్జేపీ) అభ్యరి్థగా నామినేషన్‌ వేశారాయన. ఈ లాలు ప్రసాద్‌ యాదవ్‌కు గతంలో పంచాయతీ మొదలుకుని ప్రెసిడెంట్‌ ఎన్నికల దాకా పోటీ చేసిన అనుభవముంది. అంతే కాదు, 2017, 2022ల్లో రెండుసార్లు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. రెండుసార్లూ ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురవడం వేరే సంగతి! సరన్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలాకాలంగా బరిలో నిలుస్తూనే వస్తున్నారు. లాలు భార్య, బిహార్‌ మాజీ సీఎం రబ్రీ దేవిపై కూడా పోటీ చేశారు. 

ఇప్పుడు వారి కుమార్తెపై బరిలో దిగారు. గత ఎన్నికల విషయం ఎలా ఉన్నా ఈసారి మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ లాలు అంటుండటం విశేషం! ‘‘జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటున్నా, నిత్యం సామాజిక సేవలో నిమగ్నమయ్యే ఉన్నా. కనుక ఈసారి సరన్‌ ప్రజలు నా వెంట ఉన్నారు’’ అంటున్నారు. రోహిణి ఓట్లను చీల్చేందుకే ఆయన బరిలో ఉన్నారని ఆరోపణలున్నాయి. పట్టించుకోనంటున్నాడు. అఫిడవిట్‌ ప్రకారం ఈ లాలు దగ్గర రూ.5 లక్షల నగదు, భార్య వద్ద 2 లక్షల నగదు, ఆయన పేరిటరూ.17.6 లక్షలు, భార్య పేరిట రూ.5.20 లక్షల చరాస్తులున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)