Breaking News

Lok sabha elections 2024: ‘రీడ్‌ ద లెటర్‌ బిట్వీన్‌’

Published on Thu, 04/25/2024 - 18:51

ఇదేదో పజిల్‌లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్‌. మొబైల్‌ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్‌ను వైరల్‌ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే..  

నేను..  
‘‘వికసిత్‌ భారత్‌ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్‌ ఓ మధ్య ఉన్న లెటర్‌ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్‌ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్‌ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది.  

మేము..
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా బీజేపీని టార్గెట్‌ చేస్తూ ఈ ట్రెండ్‌నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్‌ మధ్య ఉన్న లెటర్స్‌ను చదవండి’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్‌ మధ్య  ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్‌ వైరల్‌ చేస్తోంది.  

పోలీసులు సైతం..  
ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్‌ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్‌ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.  ‘‘డ్రైవింగ్‌ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్‌ ఆర్‌ మధ్యలో లెటర్స్‌ (డబ్ల్యూ, ఈ) చలాన్‌తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్‌ వేస్తామని అర్థమన్నమాట.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)