Breaking News

Lok Sabha elections 2024: కాంగ్రెస్, ఆప్‌ సీట్ల సర్దుబాటు!

Published on Fri, 02/23/2024 - 06:10

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపే అంశంపై కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మంతనాలు మొదలెట్టాయి. త్వరలోనే ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై తుది నిర్ణయం వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయితే ఇప్పటికే కొన్ని ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో ఆప్‌ బరిలో దిగనుంది.

చాంద్‌నీ చౌక్, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెడుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో ఈ ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. హరియాణాలో ఒకటి, గుజరాత్‌లో రెండు స్థానాలను ఆప్‌కే కేటాయించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. గురుగ్రామ్‌ లేదా ఫరీదాబాద్‌లో ఆప్‌ పోటీచేయనుంది. గుజరాత్‌లోని భరూచ్‌ స్థానం నుంచి ఆప్‌ నేత ఛైతర్‌ వసావా, భావ్‌నగర్‌లో ఉమేశ్‌భాయ్‌ మాక్వానా పోటీ చేస్తారని ఇప్పటికే ఆప్‌ ప్రకటించింది.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)