Breaking News

Lok Sabha Election 2024: డ్రమ్స్‌.. ధూం ధాం

Published on Thu, 05/16/2024 - 04:49

సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. 

‘ధునుచి నాచ్‌’లాగే డ్రమ్స్‌ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్‌ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. 

వీళ్లు ముఖ్యంగా రోడ్‌ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్‌ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో,  విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్‌లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! 

డిమాండ్‌ పిరిగింది... 
ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్‌ ఉండేది కాదంటున్నారు శివ్‌పాద్‌ దాస్‌. ఆయన మాచ్‌లాండ్‌పూర్‌లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్‌ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్‌పాద్‌ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్‌ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్‌ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 

14 ఏళ్ల కిందట మొదలై... 
ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్‌ చంద్ర దాస్‌ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్‌లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్‌–హంట్‌ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. 
                   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)