Breaking News

Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్‌లు... అయితే ఏంటి?

Published on Sat, 05/04/2024 - 04:26

ఈవీఎంపై ఇద్దరు రాహుల్‌ గాంధీలు కనిపిస్తే? ఎవరికి ఓటేయాలి? ఇది ఎంతో కొంతమంది ఓటర్లను అయోమయానికి గురి చేసే అంశమే. కీలక అభ్యర్థుల పేర్లను పోలిన వారిని ప్రత్యర్థి పారీ్టలు బరిలో దించి ఓట్లను చీల్చడం పరిపాటే. కొన్నిసార్లు అభ్యర్థుల గెలుపోటములనే ప్రభావితం చేసే ఈ పోకడకు చెక్‌ పెట్టాలంటూ ‘సాబు స్టీఫెన్‌’ అనే వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులోనే పిల్‌ వేశారు! 

అదే పేరుతో మరొకరు పోటీలో ఉండడం వల్ల వెంట్రుకవాసి తేడాతో ఓటమి పాలైన ఉదంతాలను ఉదహరించారు. ‘‘2004 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో అలప్పుజ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వీఎం సుదీరన్‌ కేవలం 1,009 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ వీఎస్‌ సు«దీరన్‌ అనే ఇండిపెండెంట్‌కు ఏకంగా 8,282 ఓట్లు పోలయ్యాయి. 

ప్రత్యర్థి పారీ్టలు డబ్బు, తదితరాలు ఎరగా చూపి ఇలాంటి నకిలీలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యలు ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలకు వ్యతిరేకం’’ అని వాదించారు. ‘‘ప్రముఖ అభ్యర్థుల పేరును పోలిన వారు బరిలో ఉంటే వారి నేపథ్యాన్ని కూలంకషంగా విచారించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి. నకిలీలని తేలితే పోటీ నుంచి నిషేధించేలా చూడండి’’ అని కోరారు. కానీ, ఈ పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచి్చంది. 

ఒకే తరహా పేర్లున్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘రాహుల్‌ గాం«దీ, లాలు ప్రసాద్‌ యాదవ్‌ వంటి ప్రముఖుల పేర్లున్న వారిని పోటీ చేయొద్దందామా? తల్లిదండ్రులు 
ఆ పేర్లు పెట్టిన కారణంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచగలమా? పిల్లలకు ఏ పేరు పెట్టుకోవాలనేది తల్లిదండ్రుల హక్కు’’ అని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది!     

– న్యూఢిల్లీ  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)