Breaking News

General Election 2024: మీ ఓటు ఉందా? లేదా? ఇలా చెక్‌ చేసుకోండి..

Published on Sat, 03/16/2024 - 19:09

కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఎట్టకేలకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ 'రాజీవ్‌ కుమార్‌' ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుందని సీఈసీ ప్రకటించారు. 

ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌, ఏప్రిల్‌ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్‌, మే 25న ఆరో దశ, జూన్‌1న ఏడో దశ పోలింగ్‌ ఉంటుందని సీఈసీ తెలిపారు. అయితే ఈ రోజు నుంచి జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండనుందని తెలిపారు.

పోలింగ్ సీజన్‌కు ముందు.. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, ఓటర్ల జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలి, పోలింగ్ బూత్‌ కనుక్కోవడం ఎలా? అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే..

  • ఓటర్ ఐడీ
  • డ్రైవింగ్ లైసెన్స్ 
  • పాస్‌పోర్ట్ 
  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డ్
  • MNREGA జాబ్ కార్డ్
  • NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
  • స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్
  • కేంద్ర/రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డు

ఎలక్టోరల్ రోల్‌లో మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి
  • స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి
  • పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి
  • జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి
  • క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి

పోలింగ్ బూత్‌ను ఎలా కనుక్కోవాలంటే..

  • అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన తరువాత పోలింగ్ బూత్‌ని తెలుసుకోవడానికి రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి. 
  • పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి
  • జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి
  • క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి

EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా సెర్చ్ చేయడం

  • భాషను ఎంచుకోవాలి
  • EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి
  • రాష్ట్రాన్ని ఎంచుకోవాలి
  • క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)