Breaking News

కలిసి ఉంటే కుటుంబం పదిలం

Published on Wed, 07/15/2026 - 11:10

 కర్ణాటక: మైసూరు జయనగర సమీపంలోని కోర్టులో అన్ని విరోధాలను మరిచి భార్యాభర్తలు మళ్లీ ఒక్కటైన భావోద్వేగ క్షణాలకు జాతీయ లోక్‌ అదాలత్‌ సాక్ష్యంగా నిలిచింది. కుటుంబ న్యాయస్థానం ప్రాంగణంలో విడాకుల కోసం దాఖలు చేసిన 36 జంటలు విచారణకు వచ్చాయి. ప్రధాన జిల్లా, సెషన్స్‌ జడ్జి ఉషారాణి వారితో మాట్లాడారు. క్రిమినల్‌ కేసుల విచారణలో నిందితులు చాలా మందికి తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్నారు. విడాకుల కారణంగా, ఒంటరి తల్లిదండ్రులకు పిల్లలపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. అప్పుడు వారు దారి తప్పుతారు. 

అందువల్ల     దంపతులు ఓపికగా ఉండి, చిన్న చిన్న సమస్యలను తామే పరిష్కరించుకోవాలి అని వివరించారు. కుటుంబ న్యాయస్థానం జడ్జి సావిత్రి కుజి మాట్లాడుతూ, ‘విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న దంపతులు, అదాలత్‌లో తమ మనసు మార్చుకుని ఒక్కటయ్యారు’ అని తెలిపారు. పిల్లల ప్రయోజనాల కోసం చాలా మంది ఏకమవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. న్యాయమూర్తులు పెద్దల స్థానంలో నిలబడి కుటుంబాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లోకేష్‌ అన్నారు. విడాకులను నివారించడం ప్రశంసనీయమని తెలిపారు. చివరకు 36 జంటలు మళ్లీ కలిసిపోయారు. జడ్జిలు మిఠాయిలు తెప్పించి వారిచేత తినిపించడం ఆప్యాయతకు అద్దం పట్టింది.  

9 వేల కేసుల పరిష్కారం 
లోక్‌ అదాలత్‌లో 9,939 కేసులు పరిష్కారమ­య్యాయి. ఒకటిన్నర నెలలుగా దీనిపై కష్టపడినట్లు జడ్జిలు, వకీళ్లు తెలిపారు. కుటుంబ న్యాయస్థానాలలో 161 కేసులు పరిష్కరించబడ్డాయి. తదుపరి అదాలత్‌ సెప్టెంబర్‌లో జరుగుతుందని జడ్జి ఉషారాణి తెలిపారు. నాగరాజప్ప సిద్దప్ప అంకాసదొడ్డి, శరణబసప్ప కెంబవి, ఇస్రత్‌ జహాన్‌ ఆరా, దివ్య పాల్గొన్నారు. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)