Breaking News

వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం

Published on Fri, 06/13/2025 - 06:07

దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం.  

సాక్షి, న్యూఢిల్లీః  దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్‌ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి  వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది.  

నివేదికలో అంశాలివీ.. 
⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి.  
⇒  పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. 

⇒  ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది.  
⇒  2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)