Breaking News

ప్రియురాలిని రూమ్‌లో లాక్‌ చేసి.. ఆపై ప్రియుడు..

Published on Thu, 07/10/2025 - 18:08

ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు.  ఓ జంట విషయంలో అదే జరిగింది. 

కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు.  ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్‌ రిలేషన్‌ అనేది ఫ్రెండ్‌ షిప్‌ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. 

అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని  కహిలిపారాలోని కళ్యాణి నగర్‌లో ఓ లివింగ్‌ రిలేషస్‌ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్‌జ్యోతి తలుక్‌దార్‌- సుస్మితలు ఏడాది కాలంగా లివ్‌-ఇన్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్‌దార్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్‌లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్‌దార్‌ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్‌లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు

వీరిద్దరూ లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని   గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్‌ అధికారులు స్పష్టం చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)