Breaking News

మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు

Published on Mon, 09/30/2024 - 06:50

పట్నా: గత కొంతకాలంగా బీహార్‌లో మద్యం అక్రమ రవాణా కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా మద్యం మాఫియా పోలీసులపై దాడికి దిగింది. బెగుసరాయ్ జిల్లాలోని లాఖో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం మద్యం మాఫియా దాడిలో లాఖో పోలీస్ స్టేషన్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ), సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)తో సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. లాఖో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిషేక్ కుమార్ నేతృత్వంలో పోలీసుల బృందం మద్యం స్థావరాలపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. బహద్‌పూర్ ముషారి తోలా ప్రాంతానికి వెళ్లి,  దేశీ మద్యం తయారీలో నిమగ్నమైన కొంతమంది స్థానికుల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో మద్యం మాఫియా పోలీసు బృందంపై రాళ్లు రువ్వింది.

ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని తెలుసుకున్న వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)