Breaking News

రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్‌ పైర్‌

Published on Sat, 12/13/2025 - 16:49

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్బాల్‌ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) కోల్‌కతా విజిట్‌ గందరగోళానికి దారితీసింది. తమ అభిమాన స్టార్‌ ప్లేయర్‌ను కళ్లారా చూడాలని తరలి వచ్చిన ఫ్యాన్స్‌కు తీవ్ర  నిరాశ ఎదురైంది. శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీని వీక్షించడానికి జనం వేలాదిగా  చేరుకున్నారు. నిర్వహణ లోపంతో  అభిమానులు నియంత్రణకోల్పోయి హింసకు దిగారు. దీంతో  టెన్షన్ వాతావరణం నెలకొంది.   ఫలితంగా సాల్ట్‌ లేక్‌ స్టేడియం  వెళ్లిన మెస్సీ  కేవంల నిమిషాల్లో  అక్కడ నుంచి వెళ్లిపోవడం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. మ్యాచ్‌ ఆడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. రూ12 వేలు పెట్టి టికెట్  కొనుగోలు చేస్తే కనీసం తమ అభిమాన మెస్సీ మొఖాన్ని కూడా చూడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు మెస్సీ సమయాన్ని వృధా చేశారని అసహనం వ్యక్తం చేశారు. 

డార్జిలింగ్ నుంచి  వచ్చిన  మహిళా అభిమాని, తాను రూ. 12,000 కు టికెట్ కొనుగోలు చేశానని, కానీ ప్రపంచవ్యాప్తంగా  అభిమానులను అలరిస్తున్న టాలిస్మాన్‌ను చూడలేకపోయానని ఆరోపించారు.

కాగా  గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం తెల్లవారుజామున కోల్ కత్తాకు చేరుకున్నారు. మెస్సీ ఇండియాలో మూడు రోజులు పాటు, నాలుగు నగరాల్లో పర్యటించ నున్నారు.  ఇందులో  భాగంగానే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. అయితే మెస్సీ కోలక్‌తా టూర్‌  సందర్బంగా ఏర్పడిన గందరగోళంలో  పట్టరాలి  ఆగ్రహంతో అభిమానులు  స్టేడియంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు విరగ్గొట్టారు బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్‌ యత్నించారు. దీంతో  జనాన్ని చెదర గొట్టడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అభిమానులు టెంట్‌ను మరియు గోల్ పోస్ట్‌ను కూడా ధ్వంసం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.


మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో  GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేసినట్టు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్  వెల్లడించారు. కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి  అదుపులో ఉందని   తెలిపారు.  అంతేకాదు నిర్వాహకులు  టికెట్ రుసుమును అభిమానులకు  తిరిగి చెల్లిస్తారని కూడా హామీ ఇచ్చారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు