Breaking News

పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన

Published on Mon, 09/30/2024 - 10:50

ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.

కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది.  ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో  ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా  ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.

మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక  చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.

ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్‌ఏ మృతి 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు