Breaking News

పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది

Published on Thu, 02/13/2025 - 07:55

లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న  అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

లక్నోలోని బుద్ధేశ్వర్‌ రింగ్‌ రోడ్డులో గల ఎంఎం లాన్‌లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్‌లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్‌ శ్రీవాస్తవ్‌ మాట్లాడుతూ స్థానికుడు దీపక్‌ కుమార్‌ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు.  అటవీశాఖ అధికారులు మ్యారేజ్‌ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామ‍న్నారు.  

ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు