Breaking News

రెండేళ్లలో తీవ్రవాదానికి చరమగీతం: అమిత్‌ షా

Published on Sat, 10/07/2023 - 05:40

న్యూఢిల్లీ: దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రెండేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వెలిబుచ్చారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో మరణాలు, హింసాత్మక ఘటనలు 2022లో గత 4 దశాబ్దాల్లోకెల్లా అతి తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ‘నక్సలిజం మానవత్వం పాలిట శాపం. దాన్ని అన్నివిధాలా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని అన్నారు. వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో పరిస్థితిపై ఆయన శుక్రవారం సమీక్ష జరిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌ సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2015లో ’వామపక్ష తీవ్రవాదంపై జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చాక ఆ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. 2010తో పోలిస్తే నక్సల్స్‌ హింసలో పోలీసు, పౌర మరణాలు 90 శాతం తగ్గాయని వివరించారు. ‘2004–14 మధ్య 17,679 నక్సల్‌ సంబంధిత హింసా ఘటనలు, 6,984 మరణాలు సంభవించాయి. 2014–23 మధ్య 7,659 ఘటనలు, 2,020 మరణాలు నమోదయ్యాయి‘ అని పేర్కొన్నారు. 

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)