Breaking News

కేబినెట్‌ విస్తరణలో లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం

Published on Wed, 08/05/2026 - 11:36

హుబ్లీ: పోటాపోటీగా జరిగిన డీకే.శివకుమార్‌ మంత్రివర్గ విస్తరణలో అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది బెళగావి కుందాతో నోటిని తీపి చేసుకున్నారు. సవదికి మంత్రి పదవి దక్కగా దీనిపై ఆశ పెట్టుకున్న పలుకుబడి కలిగిన మహిళా నాయకురాలు, మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి శివకుమార్‌ కేబినెట్‌లో బెళగావి జిల్లాకు రెండు స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు చిక్కోడి లోక్‌సభ పరిధిలోకి రాగా, బెళగావి లోక్‌సభకు మొండి చేయి చూపారని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు.   

సవదిని వరించిన అదృష్టం 
జిల్లాలోని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాను సవది, లక్ష్మీ, అశోక్‌ పట్టణ, మహంతేష్‌ కౌజలిగి మంత్రిగిరి కోసం జోరుగా లాబీయింగ్‌ చేశారు. దీంతో సహజంగానే ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న కుతూహలం నెలకొనగా, చివరికి లక్ష్మణ సవదికి అమాత్య పదవి దక్కింది. ఇప్పటికే చిక్కోడి లోక్‌సభ పరిధిలోని యమనకమరడి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే సతీష్‌ జార్కిహోళికి తొలి దశలోనే డీకే.మంత్రి వర్గంలో స్థానం లభించింది. రెండో విస్తరణలో కూడా అదే లోక్‌సభ స్థానం పరిధిలోని అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని మంత్రి పదవి వరించింది.  

బెళగావి లోక్‌సభకు మొండిచేయి 
రెండు మంత్రి స్థానాలు చిక్కోడి పాలు కావడంతో బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లభించక పోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసే సూచనలు ఉన్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన అనుభవం, పార్టీ సంఘటితత్వానికి శ్రమించిన తీరు తనకు లాభిస్తుందని భావించిన ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలుముకున్నాయి. దీంతో లక్ష్మి అభిమానులు పలు చోట్ల తమ ఆందోళనను వ్యక్త పరిచి పార్టీ హైకమాండ్‌పై ఆక్రోశించారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)