Breaking News

పిటిషన్ల డ్రాఫ్టింగ్‌ సూటిగా ఉండాలి 

Published on Sat, 05/10/2025 - 05:04

న్యూఢిల్లీ: న్యాయ విచారణలో ప్రక్రియలో సంక్షిప్తంగా, సూటిగా ఉండే పిటిషన్ల అవసరం ఎంతో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నొక్కిచెప్పారు. డ్రాఫ్టింగ్‌ కళపై పట్టు సాధించేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషన్లు స్పష్టంగా సంక్షిప్తంగా ఉండటం లాయర్లేకాదు, జడ్జీలకు కూడా ప్రయోజనకరమని చెప్పారు.

 ఈ నెల 13వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా శుక్రవారం తనకు సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏవోఆర్‌ఏ) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. 14వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సీజేఐ జస్టిస్‌ ఖన్నా తన పదవీ కాలంలో పారదర్శకతను, సమ్మిళితత్వాన్ని తీసుకువచ్చారని ప్రశంసించారు. సుప్రీంకోర్టులో ఆడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డు ఎంతో కీలకమైన వారని, అత్యున్నత న్యాయస్థానానికే కాదు, దేశంలోని పౌరులందరికీ ప్రతినిధులంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కొనియాడారు. 

అయితే, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పగలిగే డ్రాఫ్టింగ్‌ కళపై పట్టు సాధించలేకపోవడం ఇంకా తనకు లోటుగానే అనిపిస్తోందని చెప్పారు. క్లుప్లంగా ఉండే ఫైళ్లను చదవడం కూడా చాలా తేలికని చెప్పారు. ఫైల్‌ చదివిన తర్వాత ఆకేసుపై సగం వరకు పట్టు దొరుకుతుందని జస్టిస్‌ ఖన్నా అన్నారు. సీనియర్లపై ఆధారపడకుండా కోర్టుల్లో కేసులను వాదించాలని న్యాయవాదులకు సూచించారు. ‘కక్షి దారులతో మాట్లాడేది మీరు. కక్షిదారులు మాట్లాడేది కూడా మీతోనే. నోట్స్‌ తయారు చేసేదీ మీరే. ఆ సారాంశాన్ని సీనియర్లకు వివరిస్తారు. 

కోర్టులో మీరే ఎందుకు వాదించరు?’అని జస్టిస్‌ ఖన్నా తెలిపారు. సంబంధిత విషయ పరిజ్ఞానం కలిగి ఉండటం లాయర్లకు ఎంతో ముఖ్యమైన విషయమని చెప్పారు. సుప్రీంకోర్టు కాకున్నా, మిగతా కోర్టుల్లో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ప్రస్తుతం ముఖ్యమైన విధానంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మీడియేషన్‌ ట్రెయినింగ్‌ కోర్సుకు ఎంతో ఆదరణ లభిస్తోందని వివరించారు. దీని వల్ల అమూల్యమైన సమయం ఆదా అవుతుందని తెలిపారు. రిటైరయ్యాక సాయం కావాల్సిన వారు మొహమాటం లేకుండా తన వద్దకు రావచ్చని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు.  
 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)